KTR: ఇంత చేసినా కేసీఆర్ ఏం చేశారని అంటున్నారు: కేటీఆర్

KTR fires on Congress

  • తలసరి ఆదాయంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలిపారన్న కేటీఆర్
  • కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపేస్తే చెరగని సత్యమని వ్యాఖ్య
  • ఆయా రాష్ట్రాల తలసరి ఆదాయాలకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన కేటీఆర్  

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ వేశారు. కేసీఆర్ ఏం చేశారని ప్రతిపక్షాలు, మీడియా అంటాయని.... రూ. 3.09 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాలలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత కేసీఆర్ దని చెప్పారు. ఇంత సాధించినా కేసీఆర్ ఏం చేశారని అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి చెరిపేస్తే చెరగని సత్యమని అన్నారు. జై తెలంగాణ అని ట్వీట్ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని రాష్ట్రాల తలసరి ఆదాయాలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.

KTR
KCR
BRS
  • Loading...

More Telugu News