KCR: కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

Police checks KCR Bus

  • తెలంగాణలో పలు చోట్ల వ్యవసాయ క్షేత్రాల పరిశీలనకు కేసీఆర్
  • ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బస్సులో పయనం
  • మండ్రాయి వద్ద కేసీఆర్ బస్సును ఆపిన పోలీసులు
  • తనిఖీల సందర్భంగా పోలీసులకు సహకరించిన కేసీఆర్ 

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఇవాళ రాష్ట్రంలో నల్గొండ, జనగామ, సూర్యాపేట ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు కేసీఆర్ బయల్దేరారు. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బస్సులో బయల్దేరగా, మండ్రాయి వద్ద కేసీఆర్ బస్సును పోలీసులు నిలిపివేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో, బస్సును తనిఖీ చేస్తున్నట్టు పోలీసులు కేసీఆర్ కు తెలిపారు. దాంతో కేసీఆర్ వారికి సహకరించారు. బస్సును పూర్తిగా తనిఖీ చేసిన పోలీసులు, కేసీఆర్ కాన్వాయ్ లోని ఇతర వాహనాలను కూడా తనిఖీ చేశారు. అనంతరం కేసీఆర్ కాన్వాయ్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

KCR
Bus
Checking
Police
BRS
Telangana

More Telugu News