Water Tree: పాపికొండలు ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం గుర్తింపు... వీడియో ఇదిగో!

Rare water tree spotted in Popikondalu forest

  • కింటుకూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు
  • అరుదైన నల్ల మద్ది చెట్టును గమనించిన అధికారులు
  • ఈ చెట్టు నుంచి 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వెల్లడి

గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాపికొండలు వద్ద అరుదైన వృక్షాన్ని గుర్తించారు. ఇక్కడి కింటుకూరు అటవీప్రాంతంలో ఓ జలధార వృక్షం అటవీశాఖ సిబ్బంది కంటపడింది. దీన్ని నల్ల మద్ది చెట్టు అంటారని, దీని నుంచి దాదాపు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వారు వెల్లడించారు. 

కింటుకూరు అటవీప్రాంతంలోని బేస్ క్యాంపును పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లగా, అక్కడ ఈ జలధార వృక్షం ఉండడాన్ని వారు గమనించారు. ఓ ఫారెస్ట్ గార్డ్ కత్తితో చెట్టుకు కొద్దిమేర రంధ్రం చేయగా, కుళాయి తిప్పినట్టు నీళ్లు బయటికి వచ్చాయి. 

చెట్టు నుంచి నీరు బయటికి రావడం చూసి అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

More Telugu News