Mumbai Indians: హార్దిక్ పాండ్యా, మలింగ మధ్య విభేదాలు...? ఈ వీడియో వైరల్

What happened between Hardik Pandya and Malinga
  • ముంబయి ఇండియన్స్ కు కొత్త కెప్టెన్ గా వచ్చిన హార్దిక్ పాండ్యా
  • రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించిన యాజమాన్యం
  • వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ముంబయి
  • జట్టులో ఏదో జరుగుతోందంటూ అనుమానాలు
ముంబయి ఇండియన్స్ శిబిరంలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకువచ్చి ముంబయి ఇండియన్స్ కు కెప్టెన్ గా చేశారు. కానీ, ఐపీఎల్ తాజా సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ముంబయి జట్టు ఓటమిపాలైంది. 

రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించి హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ప్రకటించినప్పుడే... జట్టులోని ఆటగాళ్లు, పలువురు సిబ్బంది కూడా హార్ట్ బ్రోకెన్ ఎమోజీలతో తమ స్పందన వెలిబుచ్చారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టి, రెండు మ్యాచ్ లు జరిగిన తర్వాత కూడా ముంబయి శిబిరంలో పరిస్థితులు సజావుగా ఉన్నాయని ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

అందుకు నిదర్శనంగా ఇటీవల ఒక వీడియో వైరల్ అయింది. సన్ రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం... హార్దిక్ పాండ్యా తమ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగను ఏదో మొక్కుబడిగా ఆలింగనం చేసుకుని, కనీసం ముఖం కూడా చూడకుండా పక్కకు మరలాడు. 

ఇప్పుడు కూడా మలింగ, హార్దిక్ పాండ్యాలతో కూడిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలింగ, బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ డగౌట్ వద్ద పక్కపక్కనే కూర్చుని ఉండగా, అక్కడే పాండ్యా కూడా నిలుచుని ఉన్నాడు. పొలార్డ్ పైకి లేచి పాండ్యాను కూర్చోమని చెప్పేంతలో... మలింగ ఒక్కసారిగా పైకి లేచి, పొలార్డ్ ను లేవొద్దని చెప్పి, తాను అక్కడ్నించి వెళ్లిపోయాడు. పాండ్యా పక్కన కూర్చోవడం ఇష్టం లేకనే మలింగ వెళ్లిపోయాడన్నది ఆ వీడియోలో సీన్ చూస్తే అర్థమవుతోంది.
Mumbai Indians
Hardik Pandya
Lasith Malinga
IPL 2024

More Telugu News