Anupama Parameshwaran: అందాల అనుపమ ఎందుకు అలిగినట్టు?

Anupama Parameshwaran

  • యూత్ లో అనుపమ పరమేశ్వరన్ కి క్రేజ్ 
  • ఒక్కసారిగా రూట్ మార్చిన అనుపమ 
  • 'టిల్లు స్క్వైర్' పోస్టర్లతో జరుగుతున్న ట్రోల్ 
  • రేపు విడుదలవుతున్న సినిమా


అనుపమ పరమేశ్వరన్ .. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతోంది. అమ్మాయి పద్ధతిగా .. లక్షణంగా కనిపిస్తుందంటూ, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆమె అభిమానులుగా మారిపోయారు. అనుపమ కూడా ఆ ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చింది. కానీ 'టిల్లు స్క్వైర్' సినిమాతో అంతా మారిపోయింది. 

రేపు విడుదలవుతున్న ఈ సినిమా .. రొమాంటిక్ టచ్ తో నడుస్తుంది. కథకి తగినట్టుగా .. తన పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం అనుపమ వెనుకాడలేదు. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ఈ సినిమా నుంచి వదిలిన హాట్ పోస్టర్లు వైరల్ అయ్యాయి. అనుపమ ఒక్కసారిగా ఇలా స్పీడ్ పెంచిందేంటబ్బా అనుకుంటూ అంతా షాక్ అయ్యారు. చాలామంది చాలా రకాలుగా కామెంట్లు పెట్టారు.

ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో అనుపమ కనిపించలేదు. ఆమె అలగడం వల్లనే రాలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన హాట్ పోస్టర్లు ఈ రేంజ్ లో వైరల్ కావడం వలన ఇబ్బందిపడి రాలేదా? లేదంటే కామెంట్లు హర్ట్ చేయడం వలన అలిగి రాలేదా? అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. 

Anupama Parameshwaran
Actress
Tillu Square
  • Loading...

More Telugu News