Rohini: శ్రీలక్ష్మి తరహా కామెడీ రోల్స్ ఇక రోహిణి కోసం రాసెయ్యొచ్చు!

Rohini Special

  • హాస్యనటిగా రాణిస్తున్న రోహిణి 
  • బుల్లితెరపై కొనసాగిస్తున్న నవ్వుల సందడి
  • మంచి ఈజ్ తో తన మార్క్ చూపుతున్న రోహిణి  
  • 'సేవ్ ద టైగర్స్ 2'తో మరింత పెరిగిన క్రేజ్ 


తెలుగు తెరపై హాస్యనటిగా శ్రీలక్ష్మి చేసిన సంతకం చెరిగిపోనిది. ఒకానొక దశలో శ్రీలక్ష్మి లేని సినిమా ఉండేది కాదు. అంతగా ఆమె తన హాస్యాన్ని ప్రవహింపజేసింది. సుత్తివేలు - వీరభద్రరావుతో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలాంటి శ్రీలక్ష్మి తరువాత ఆ తరహాలో కొంతకాలం పాటు కోవై సరళ నవ్విస్తూ వెళ్లింది.

తెలుగు తెరపై కోవై సరళ జోరు కొనసాగుతూ ఉండగానే, కొన్ని కారణాల వలన ఆమె ఇక్కడి సినిమాలకి దూరమైంది. ఆ తరువాత విద్యుల్లేఖ రామన్ నవ్వుల సందడి చేసింది. ఇక ఇటీవల కాలంలో శ్రీలక్ష్మి తరహా పాత్రలు చేసేవారు లేరనే ఒక అభిప్రాయంతో ఆ తరహా పాత్రలను డిజైన్ చేసే ఆలోచన ఎవరూ చేయడం లేదు. అలాంటి వాళ్లంతా ఇక శ్రీలక్ష్మి తరహా పాత్రలను ధైర్యంగా క్రియేట్ చేసుకోవచ్చు.

అవును .. కొంతకాలంగా బుల్లితెరపై 'జబర్దస్త్' వంటి కామెడీ షోస్ ద్వారా .. కొన్ని సీరియల్స్ ద్వారా హాస్యనటిగా మంచి మార్కులు కొట్టేస్తూ రోహిణి తన జోరు చూపిస్తోంది. ఇటీవల వచ్చిన 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్ లో వంటమనిషి లక్ష్మి పాత్రలో ఆమె హాయిగా నవ్వించింది. ఆ సిరీస్ మొత్తంలోకి ఆమె పాత్ర హైలైట్ గా నిలిచింది. కనుక ఇక సినిమాల్లోను ఈ తరహా పాత్రలను రోహిణి కోసం రాసుకోవచ్చునేమో. 

Rohini
Actress
Save The Tigers 2
  • Loading...

More Telugu News