Tillu Square: 'టిల్లు స్క్వేర్' నుంచి రిలీజ్ ట్రైలర్ ఇదిగో!

Release trailer from Tillu Square out now

  • సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా టిల్లు స్క్వేర్
  • మల్లిక్ రామ్ దర్శకత్వంలో చిత్రం
  • మార్చి 29న వరల్డ్ వైడ్ రిలీజ్

సిద్ధు జొన్నలగడ్డ  తనదైన కామెడీ టైమింగ్ తో నటించిన మరో చిత్రం టిల్లు స్క్వేర్. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. సంచలన విజయం సాధించిన డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మార్చి 29న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంది.

More Telugu News