IPL 2024: ఐపీఎల్: ముంబయి ఇండియన్స్ టార్గెట్ 169 రన్స్

Gujarat Titans set Mumbai Indians 169 runs target
  • అహ్మదాబాద్ లో ముంబయి ఇండియన్స్ × గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసిన గుజరాత్
  • 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన సాయి సుదర్శన్
  • 3 వికెట్లతో సత్తా చాటిన జస్ప్రీత్ బుమ్రా
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. 

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేయడంలో విఫలమైంది. 

గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 31, రాహుల్ తెవాటియా 22 పరుగులు చేశారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, గెరాల్డ్ కోట్జీ 2, పియూష్ చావ్లా 1 వికెట్ తీశారు.
IPL 2024
Mumbai Indians
Gujarat Titans
Ahmedabad

More Telugu News