Emraan Hashmi: పవన్ కల్యాణ్ 'ఓజీ' నుంచి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ విడుదల

OG unit releases Emraan Hashmi first look

  • పవన్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో చిత్రం
  • విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ
  • "గంభీరా... ఇద్దరిలో ఒకరి తలే మిగిలుతుంది" అంటూ డైలాగ్ పోస్ట్ చేసిన హష్మీ

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. 

ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు సందర్భంగా ఓజీ చిత్రబృందం అతడి లుక్ ను విడుదల చేసింది. స్టయిలిష్ గా సిగార్ వెలిగించుకుంటున్న ఇమ్రాన్ హష్మీని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూడొచ్చు. 'ఓజీ' చిత్రంలో ఇమ్రాన్ పాత్ర పేరు 'ఓమీ బావు'. తెలుగులో ఇమ్రాన్ హష్మీకి ఇదే తొలి చిత్రం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక బీభత్సమైన గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. 

ఇక తన ఫస్ట్ లుక్ పై ఇమ్రాన్ హష్మీ ఓజీ సినిమాలోని ఓ డైలాగ్ తో స్పందించాడు. "గంభీరా... నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ప్రామిస్... ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది!" అంటూ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో, పవన్ పేరు ఈ సినిమాలో గంభీరా అయ్యుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 

ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News