Yamini: మా ఊరు పేరు చెబితే చాలు .. ఇంటివరకూ వచ్చేస్తున్నారు: యూ ట్యూబర్ యామిని

- యూ ట్యూబర్ గా యామినీకి మంచి పేరు
- సంప్రదాయ దుస్తుల్లో మెరవడం ఆమె ప్రత్యేకత
- సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నాయని వెల్లడి
- తన ఇంటికి రావడానికి ట్రై చేయవద్దని విన్నపం
- విదేశాల్లో ఎమ్మెస్ చేయనున్నట్టు వివరణ
యూ ట్యూబ్ ను తరచూ చూసేవారికి ఇ.ఆర్. యామినీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. ఇవి మాత్రమే కాదు .. నిర్మలమైన .. నిష్కల్మషమైన ఆమె నవ్వుకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఆమెను ఇంతమంది ఇంతగా అభిమానించడానికి కారణం, తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే ఆమె వేషధారణ. ఒక సీరియల్ మాదిరిగా .. ఒక వెబ్ సిరీస్ సీజన్ల మాదిరిగా ఆమె వీడియోస్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు.


" మొదటి నుంచి కూడా లంగావోణీ .. చీరలు అంటే ఇష్టపడతాను. అందువలన వాటినే ఎక్కువగా ధరిస్తూ ఉంటాను. హైదరాబాద్ లో ఒక ఏడాది జాబ్ కూడా చేశాను. యూఎస్ లో ఎమ్మెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లిన తరువాత కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను" అని అన్నారు.