Arvind Kejriwal Arrest: ఈడీని అడ్డం పెట్టుకోవడం కాదు.. దమ్ముంటే ఎన్నికల క్షేత్రంలో తలపడదాం రండి.. బీజేపీకి ఆప్ మంత్రి అతిషి సవాల్

BJP Should Fight In Election But With Not With ED Help

  • బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్న మంత్రి అతిషి
  • ఈడీని అడ్డం పెట్టుకోవడం మానాలని హితవు
  • మరికాసేపట్లో కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్న రాహుల్‌గాంధీ

ఈడీని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకోవడం సరైనది కాదని, దమ్ముంటే తమతో ఎన్నికల క్షేత్రంలో తలపడాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మంత్రి అతిషి బీజేపీకి సవాల్ విసిరారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఢిల్లీ మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈడీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, వారు (బీజేపీ నాయకులు) ఇద్దరు ముఖ్యమంత్రులు (ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కేజ్రీవాల్)ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. పార్టీ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఈ రకంగా గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. వారు కొట్లాడాలనుకుంటే ఎన్నికల్లో కొట్లాడాలి కానీ, ఇదేం పని? అని ప్రశ్నించారు. ఈడీని అస్త్రంగా మార్చుకోవడాన్ని మానుకోవాలని బీజేపీకి హితవు పలికారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నారు. ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడిన ఆయన అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆయన కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నట్టు తెలిసింది. గత రాత్రి హైడ్రామా మధ్య ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News