Nara Lokesh: దేవాన్ష్ బర్త్ డే.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారావారి కుటుంబం

Nara family in Tirumala

  • శ్రీవారి సేవలో లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్
  • నిన్న సాయంత్రమే తిరుమలకు చేరుకున్న నారావారి కుటుంబం
  • దేవాన్ష్ ప్రతి పుట్టినరోజున అన్నదానం చేస్తున్న వైనం

టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'నిజం గెలవాలి' యాత్రలో ఉన్న భువనేశ్వరి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్ నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చారు. దేవాన్ష్ ప్రతి పుట్టిన రోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నారు. ఈసారి కూడా అన్నదానం చేశారు. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు.

Nara Lokesh
Nara Bhuvaneswari
Nara Brahmani
Devansh
Telugudesam
AP Politics
  • Loading...

More Telugu News