Chandrababu: 160కి పైగా సీట్లు వస్తాయి: చంద్రబాబు

TDP will win more than 160 seats says Chandrababu
  • లోక్ సభలో ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయన్న చంద్రబాబు
  • ఈ సాయంత్రం 11 మంది టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
  • పెండింగ్ లో 16 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు
రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 160కి పైగా స్థానాలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభలో ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతమని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. 

మరోవైపు ఈరోజు కొంత మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 114 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఇప్పటి వరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. లోక్ సభ అభ్యర్థులను మాత్రం ఆయన ఇంత వరకు ప్రకటించలేదు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం 11 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.  
Chandrababu
Telugudesam
MP Candidates
MLA Candidates
NDA
Janasena
AP Politics

More Telugu News