Kishan Reddy: కల్వకుంట్ల కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సబంధం లేదు: కిషన్ రెడ్డి

BJP not behing Kavitha arrest says Kishan Reddy
  • కవిత పీఏ, బినామీలు అప్రూవర్ గా మారి స్కామ్ వివరాలు ఇస్తున్నారన్న కిషన్ రెడ్డి
  • బినామీలతో లిక్కర్ వ్యాపారాలు చేసి మా పార్టీపై విమర్శలు గుప్పిస్తారా? అని మండిపాటు
  • అవినీతిపరులను వదిలే ప్రసక్తే లేదని వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈడీ కార్యాలయంలో ఆమె విచారణను ఎదుర్కొంటున్నారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో బీజేపీపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు స్పందిస్తూ... కవిత అరెస్ట్ తో బీజేపీకి సంబంధం లేదని చెప్పారు. కవిత పీఏ, బినామీలు అప్రూవర్ గా మారి లిక్కర్ స్కామ్ వివరాలను ఇస్తున్నారని తెలిపారు. బినామీలతో లిక్కర్ వ్యాపారాలు చేసి... మా పార్టీపై విమర్శలు గుప్పిస్తారా? అని మండిపడ్డారు. 

ఈడీ అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని... దానికి అధికారాలు ఉంటాయని చెప్పారు. అవినీతిపరులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని కవిత చెప్పాలని అన్నారు. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy
BJP
K Kavitha
BRS
Delhi Liquor Scam

More Telugu News