U-1 Zone: అమరావతిలో యూ-1 జోన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt revokes U1 zone in Amaravathi

  • గత ప్రభుత్వ హయాంలో యూ-1 జోన్ ప్రకటన
  • యూ-1 జోన్ లో ఉన్న భూముల క్రయవిక్రయాలు నిషిద్ధం
  • ఆందోళన చేపట్టిన రైతులు
  • జోన్ ఎత్తివేస్తున్నట్టు నేడు గెజిట్ విడుదల చేసిన వైసీపీ సర్కారు 

మరి కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి షరతులు లేకుండా అమరావతిలో యూ-1 జోన్ ఉపసంహరించుకుంది. యూ-1 జోన్ ఎత్తివేస్తున్నట్టు నేడు గెజిట్ విడుదల చేసింది. 

అమరావతి ప్రాంతంలోని 178 ఎకరాల భూమిని రాజధాని అవసరాల నిమిత్తం నాడు యూ-1 జోన్ గా ప్రకటించారు. యూ-1 జోన్ లో ఉన్న ఆస్తుల అమ్మకం, కొనుగోలు, ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషిద్ధం. తాము అధికారంలోకి వచ్చాక యూ-1 జోన్ ఎత్తివేస్తామని 2019 ఎన్నికల వేళ వైసీపీ హామీ ఇచ్చింది. యూ-1 జోన్ ఎత్తివేత కోసం రైతులు 140 రోజుల పాటు  దీక్ష చేపట్టారు. 

ఇటీవలే జయహో బీసీ సభలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు యూ-1 జోన్ అంశాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే యూ-1 జోన్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఇదే హామీ ఇచ్చారు. అయితే, ఈలోపే వైసీపీ సర్కారు యూ-1 జోన్ ను వెనక్కి తీసుకుంది.

  • Loading...

More Telugu News