Ranji Trophy: ముంబై ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్
![Mumbai win their 42nd Ranji Trophy title](https://imgd.ap7am.com/thumbnail/cr-20240314tn65f2bb942e33e.jpg)
- విదర్భపై 169 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
- ముంబై: 224 (తొలి ఇన్నింగ్స్), 418 (రెండో ఇన్నింగ్స్ )
- విదర్భ: 105 (తొలి ఇన్నింగ్స్), 368 (రెండో ఇన్నింగ్స్ )
- రంజీ ట్రోఫీ గెలిచిన 26వ ముంబై కెప్టెన్‌గా అజింక్యా రహానే
ముంబై 42వ సారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. వాంఖడే స్టేడియంలో విదర్భతో జరిగిన ఫైనల్‌లో 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులు చేయగా, విదర్భ 105 పరుగులకే చాపచుట్టేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని విదర్భ ముందు 537 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఈ భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 368 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబై 169 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. అలాగే ముంబై తన ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను వేసుకుంది. రంజీ ట్రోఫీ గెలిచిన 26వ ముంబై కెప్టెన్‌గా అజింక్యా రహానే నిలిచాడు. అతని కంటే ముందు 25 మంది కెప్టెన్లు ముంబైకి 41 టైటిల్స్ అందించారు.