AP BJP Candidates: ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు దాదాపు ఖరారు.. ఆ స్థానాలు ఏవంటే..!

List of AP BJP candidates

  • 10 అసెంబ్లీ స్థానాలకు దాదాపు ఖరారైన అభ్యర్థులు
  • కైకలూరు నుంచి సోము వీర్రాజు
  • జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి

రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ పోటీ చేయబోయే 10 అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారయ్యాయి. ఈ స్థానాల్లో శ్రీకాకుళం, విశాఖ నార్త్, పాడేరు, కైకలూరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, బద్వేలు, ఆదోని, ధర్మవరం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, కైకలూరు నుంచి సోము వీర్రాజు, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుతో పాటు మరొకరి పేరు, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, బద్వేలు నుంచి సురేశ్, ఆదోని నుంచి కొనిగిరి నీలకంఠం (కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు), శ్రీకాకుళం నుంచి కె.సురేంద్ర మోహన్ (బీజేపీ రాష్ట్ర కార్యదర్శి) పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఈరోజు తన రెండో జాబితాను విడుదల చేయనుంది. 

AP BJP Candidates
List
AP Politics
  • Loading...

More Telugu News