Nara Lokesh: ప్రధాని మోదీ పాల్గొనే చిలకలూరిపేట సభా ప్రాంగణం వద్ద లోకేశ్ భూమిపూజ

- బొప్పూడిలో ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ సభ
- మూడు పార్టీల నాయకులతో కలిసి సభాస్థలి పరిశీలన
- సభ ఏర్పాట్లపై వివిధ కమిటీలతో చర్చ
- లక్షలాదిమంది తరలివచ్చే సభలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఉండేలే ఏర్పాట్లు
ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ ఉదయం బొప్పూడి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సభా ప్రాంగణం వద్ద భూమిపూజ చేశారు. అంతకుముందు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. వివిధ కమిటీలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు.

