Jayasudha: డాక్టర్ అంటే శోభన్ బాబుగారు భయపడేవారు: జయసుధ

Jayasudha Interview

  • శోభన్ బాబుగారికి సమయస్ఫూర్తి ఎక్కువన్న జయసుధ 
  • ఆయనను రాధిక 'బన్ బాబు' అని పిలిచేదని వెల్లడి 
  • ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకునేవారని వ్యాఖ్య 
  • అప్పుడు ఆయనతో మాట్లాడలేకపోయానని వివరణ    


జయసుధ - శోభన్ బాబు కలిసి అనేక చిత్రాలలో నటించారు. ఆ సినిమాలలో విజయాలను అందుకున్నవే ఎక్కువ. అప్పట్లో వారిది హిట్ పెయిర్ అనే చెప్పాలి. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలను చూడటానికి అప్పట్లో చాలామంది ఆసక్తిని కనబరిచేవారు. రీసెంటుగా ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ప్రస్తావించారు. 

" నేను .. శోభన్ బాబు గారు షూటింగు సమయంలో చాలా సరదాగా మాట్లాడుకునే వాళ్లం. ఆయనకి చాలా సమయస్ఫూర్తి ఎక్కువ. హీరోయిన్ రాధిక ఆయనను 'బన్ బాబు' అని పిలిచేది. తన ఆరోగ్యం విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటే భయపడేవారు .. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు" అని అన్నారు. 

" శోభన్ బాబుగారి దగ్గరికి చంద్రమోహన్ గారు వెళ్లినప్పుడు, 'జయసుధను కాల్ చేయమని చెప్పు' అన్నారట. ఆ విషయాన్ని చంద్రమోహన్ గారు నాకు చెప్పారు .. కానీ ఆ సమయంలో నేను కొంచెం బిజీగా ఉండటం వలన చేయలేకపోయాను. వారం తిరిగేలోగా శోభన్ బాబుగారు చనిపోయారని తెలిసి షాక్ అయ్యాను. నేనసలు నమ్మలేకపోయాను" అని చెప్పారు.

Jayasudha
Actress
Sobhan Babu
Radhika
  • Loading...

More Telugu News