Arogya Sri: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామంటూ నోటీసులు ఇచ్చిన ఆసుపత్రుల కమిటీ

Arogya Sri hospitals committee sent notice to AP Govt

  • ఇచ్చిన హామీలు అమలు  చేయడంలేదంటూ ఆసుపత్రుల కమిటీ అసంతృప్తి
  • రూ.850 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడి
  • ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటన

ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల ట్రస్టు యాజమాన్య కమిటీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని, ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి ఇంకా రూ.850 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నామని ఆసుపత్రుల ట్రస్టు యాజమాన్య కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఆసుపత్రుల కమిటీ డిమాండ్ చేసింది.

More Telugu News