Vande Bharat Rail: సికింద్రాబాద్-విశాఖ మధ్య .. రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

Modi inaugurated second Vande Bharat express between Secunderabad and Vizag

  • రైలును వర్చువల్ గా ప్రారంభించిన మోదీ
  • సికింద్రాబాద్ స్టేషన్ లో పచ్చ జెండా ఊపిన కిషన్ రెడ్డి
  • రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు

సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా... సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది.

More Telugu News