Devireddy Sivashankar Reddy: వివేకా హత్య కేసులో కీలక పరిణామం... దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్

Bail granted for Devireddy Sivashankar Reddy

  • 2019లో వివేకా హత్య
  • 2021లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్
  • నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు 

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో పలు షరతులు విధించింది. 

సీబీఐ కోర్టులో విచారణ జరిగే సమయంలో శివశంకర్ రెడ్డి ఏపీలో ఉండకూడదని ఆదేశించింది. బెయిల్ కు రూ.2 లక్షలు పూచీకత్తుగా సమర్పించాలని పేర్కొంది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది. బెయిల్ లభించిన నేపథ్యంలో శివశంకర్ రెడ్డి రేపు చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.

వైఎస్ వివేకా 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా భావించి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని 2021 సెప్టెంబరు 17న హైదరాబాదులో అరెస్ట్ చేశారు.

Devireddy Sivashankar Reddy
Bail
Telangana High Court
YS Vivekananda Reddy
  • Loading...

More Telugu News