Mamitha Baiju: ఇప్పుడు యూత్ కలల రాణి .. మమిత బైజు!

Mamitha Baiju Special

  • యూత్ హృదయాలను దోచేసిన మమిత 
  • 'ప్రేమలు' సినిమాతో పెరిగిపోయిన క్రేజ్ 
  • టాలీవుడ్ నుంచి వెళుతున్న భారీ ఆఫర్లు 
  • ఇక్కడ కూడా బిజీ అయ్యే ఛాన్స్  


యూత్ నోళ్లలో ఇప్పుడు ఎక్కువగా నానుతున్న పేరు 'మమిత బైజు'. ఆమె కథానాయికగా నటించిన 'ప్రేమలు' సినిమా ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకెళుతోంది. మలయాళంలో గిరీశ్ తెరకెక్కించిన ఈ సినిమా, అక్కడి ప్రేక్షకులను ఫిబ్రవరి 9వ తేదీన పలకరించింది. అక్కడి యూత్ ను ఈ సినిమా ఒక ఊపు ఊపేసింది. రీసెంటుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మంచి మార్కులను కొట్టేసింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన మమిత బైజు, అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. అందుకు కారణం ఆమెలో కనిపించే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ .. నటనలో సహజత్వం. కేరళ ప్రాంతానికి చెందిన ఈ బ్యూటీ, 2017లోనే ఓ మలయాళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత ఏడాదికి రెండు సినిమాలను చేస్తూ వెళ్లింది. టీనేజ్ లోనే సినిమాల్లోకి వచ్చిన మమిత, నటన పరంగా అనేక అవార్డులను అందుకుంటూ వచ్చింది. అయితే ఇంతవరకూ ఆమె చేసిన 16 సినిమాలు ఒక ఎత్తు .. 'ప్రేమలు' సినిమా ఒక ఎత్తు అనే చెప్పాలి. ఈ సినిమా తరువాత ఆమెకి టాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్లు వెళుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే మమిత ఇక్కడ కూడా బిజీ అయ్యేలానే కనిపిస్తోంది మరి. 

Mamitha Baiju
Actress
Premalu Movie
  • Loading...

More Telugu News