Revanth Reddy: భద్రాచల రాముడిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy offer prayers at Bhadrachalam

  • సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు పొంగులేటి, తుమ్మల, సీతక్క 
  • పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికిన అర్చకులు, ఈవో 
  • పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, ఈవో పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

Revanth Reddy
Bhadradri Kothagudem District
lord rama
Telangana
  • Loading...

More Telugu News