Pakistan: పాక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జర్దారీ!

Zardari takes oath as pak president

  • ఇస్లామాబాద్‌లో ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • జర్దారీతో ప్రమాణ స్వీకారం చేయించిన పాక్ చీఫ్ జస్టిస్
  • కార్యక్రమానికి పాక్ ప్రధాని సహా పలువురు నేతల హాజరు  

పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దేశ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కోచైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో జర్దారీతో పాక్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫేజ్ ఇసా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహ పలువులు ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జర్దారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.

More Telugu News