Chiranjeevi: విశ్వంభర సెట్స్ పై అడుగుపెట్టిన త్రిషకు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్!

Chiranjeevi gifted Trisha on Vishwambhara sets

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర
  • ఇటీవలే షూటింగ్ ప్రారంభం
  • త్రిషకు టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ గిఫ్ట్ గా ఇచ్చిన చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టు విశ్వంభరలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజుల కిందట త్రిష కూడా సెట్స్ పై అడుగుపెట్టింది. 

ఈ సందర్భంగా ఆమెకు మెగాస్టార్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందినట్టు తెలిసింది. ఆ గిఫ్ట్ ఓ ఖరీదైన టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్... ఈ గిఫ్ట్ తనకు బాగా నచ్చిందని త్రిష సోషల్ మీడియాలో పేర్కొంది... చిరంజీవికి కృతజ్ఞతలు తెలుపుకుంది... ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశ్వంభర చిత్రాన్ని యువ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జానర్ లో రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది.

More Telugu News