Kesineni Nani: అమిత్ షా కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాశారు: కేశినేని నాని

Kesineni Nani fires on Chandrababu

  • తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న కేశినేని నాని
  • ఎంత మంది కలిసొచ్చినా జగన్ ను ఓడించలేరని వ్యాఖ్య
  • జగన్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందన్న నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని అన్నారు. మూడు రోజుల నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాశారని ఎద్దేవా చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఒరిగేది ఏమీ లేదని కేశినేని నాని అన్నారు. ఎంత మంది కలిసొచ్చినా ముఖ్యమంత్రి జగన్ ను ఓడించడం కల అని చెప్పారు. వైసీపీ 175కి 175 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. జనసైనికుల ఆత్మాభిమానాన్ని నారా లోకేశ్ వద్ద పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడేనని అన్నారు. టీడీపీ, జనసేనలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. జగన్ అందించిన సంక్షేమమే వైసీపీకి ఘన విజయాన్ని అందిస్తుందని నాని అన్నారు.

Kesineni Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News