BRS: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడు

Errabelli follower Marneni Ravinder Rao joins BRS
  • ఒక్కొక్కరుగా కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్న బీఆర్ఎస్ నేతలు
  • కాంగ్రెస్ లో చేరిన మార్నేని రవీందర్ రావు, ఆయన భార్య మధుమతి
  • ఈరోజు రేవంత్ రెడ్డిని కలవనున్న రవీందర్ రావు దంపతులు
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతూ... కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన భార్య, ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి, కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వీరు ఈరోజు కలవనున్నారు. మరోవైపు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మార్నేని రవీందర్ రావు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.
BRS
Errabelli
Marneni Ravinder Rao
Congress
revanth

More Telugu News