Revanth Reddy: పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy laying foundation stone for the Old City Metro Rail Project

  • రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన 
  • తమ ప్రభుత్వం వరుసగా అభివృద్ధి పనులతో ముందుకు సాగుతోందన్న ముఖ్యమంత్రి
  • ఎన్నికల సమయంలోనే రాజకీయాలు... మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యత ఉంటుందని హామీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతబస్తీ మెట్రో రైలు మార్గానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర ఐదు స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి వెళ్లవచ్చు.

మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం వరుసగా అభివృద్ధి పనులతో ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయాల్లో అభివృద్ధికే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌కు తాగునీరు కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు.

  • Loading...

More Telugu News