Samantha: మనసుకైన గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది: సమంత
![Samatha latest interview](https://imgd.ap7am.com/thumbnail/cr-20240308tn65eaeeb11e9d3.jpg)
- అభద్రతాభావానికి గురవుతున్నానని గ్రహించగానే దాన్నుంచి బయటకు వచ్చానన్న సమంత
- మనపై మనకున్న విశ్వాసమే గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్న సామ్
- ఇటీవలే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన సమంత
సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరితో టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన విశేషాలను, ఫొటోలను పంచుకుంటోంది. తాజాగా ఓ మేగజీన్ కి ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను అభద్రతా భావానికి గురవుతున్నాననే విషయాన్ని గ్రహించగలిగానని... ఆ వెంటనే దాన్నుంచి బయటకు వచ్చానని సమంత తెలిపింది. బయటకు కనిపించే గాయాలకంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవడానికే ఎక్కువ సమయం పడుతుందని చెప్పింది. మనపై మనకున్న విశ్వాసమే మనం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.
సినిమాల విషయానికి వస్తే... 'ఖుషి' సినిమా తర్వాత ఆమె మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఆమె నటించిన వెబ్ సిరీస్ (ఇండియన్ వర్షన్) 'సిటాడెల్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో హీరోగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించాడు. ఇటీవలే సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. 'ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించింది.