National Creators Award: ఆ ఒక్క పనితో మోదీ అందరి హృదయాలు గెలుచుకున్నారు.. నెట్టింట ప్రధానిపై ప్రశంసల జల్లు
![PM Modi Touches the Feet of Woman during National Creators Award Event](https://imgd.ap7am.com/thumbnail/cr-20240308tn65eadb9843f38.jpg)
- ప్రధాని కాళ్లు మొక్కిన మహిళ.. వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించిన మోదీ
- ఎవరైనా తన కాళ్లు పట్టుకుంటే నచ్చదన్న ప్రధాని మోదీ
- 'నేషనల్ క్రియేటర్స్ అవార్డుల' ప్రదానోత్సవంలో ఘటన
- ఇకపై దేశంలోని సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా మంచి గుర్తింపు
ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ఒక పని అందిరి హృదయాలను గెలుచుకుంది. విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న సమయంలో ఓ మహిళ వేదికపైకి వచ్చారు. ఆమె వచ్చి ప్రధాని మోదీ కాళ్లు మొక్కారు. అంతే.. అది చూసిన ప్రధాని వెంటనే ఆ మహిళ కాళ్లకు తనూ నమస్కరించారు.
'మీ కళా ప్రపంచంలో గురువుల కాళ్లకు నమస్కరించడం సహజం. కానీ, రాజకీయాలలో ఇలా చేస్తే దానికి చాలా అర్థాలు చెబుతారు' అన్నారు ప్రధాని. ఇక తన విషయానికి వస్తే ఎవరైనా తన కాళ్లకు మొక్కితే.. తనకు ఏదోలా ఉంటుందన్నారు. ఇంకా చెప్పాలంటే తనకు అసలు నచ్చదని చెప్పుకొచ్చారు. మోదీ చేసిన ఈ పనిపై ఇప్పుడు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదిలాఉంటే.. దేశంలోని సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా ఇకపై మంచి గుర్తింపు లభించనుంది. ఎందుకంటే వారి కోసమే మొదటిసారిగా ఈ 'నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్'ను తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు సోషల్ మీడియా క్రియేటర్లకు అవార్డులు అందజేయడం జరిగింది.