Prisoner: విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి
![Remand prisoner died in Vijayawada Sub Jail](https://imgd.ap7am.com/thumbnail/cr-20240308tn65eab4e727146.jpg)
- డ్రంకెన్ డ్రైవ్ కేసులో రిమాండ్‌లో ఉన్న బాలగంగాధర్ తిలక్
- మృతుడిని ఆటో డ్రైవర్ గా గుర్తింపు
- బ్యారక్‌లో స్పృహ తప్పిపడి ఉండగా గుర్తించిన పోలీసులు
విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఖైదీ మృతిచెందడం కలకలం రేగింది. విజయవాడ వన్‌టౌన్ గొల్లపాలెంకు చెందిన బాలగంగాధర్ తిలక్ అనే ఆటో డ్రైవర్‌కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న అతడు గురువారం ఉదయం తన బ్యారక్‌లో స్పృహ తప్పిపడి ఉండగా పోలీసులు గుర్తించారు. దాంతో వెంటనే తిలక్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అసలు అతడు ఎలా మృతిచెందాడు? అన్నది తెలియాల్సి ఉంది.