Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు... కాసేపట్లో అమిత్ షాతో భేటీ

Chandrababu arrives Delhi

  • ఏపీలో పొత్తు రాజకీయాలు
  • చేయి కలిపిన టీడీపీ, జనసేన
  • బీజేపీని కూడా కూటమిలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
  • ఇప్పటికే ఓసారి అమిత్ షాతో భేటీ
  • ఇవాళ్టి  సమావేశంలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం జేపీ నడ్డా సహా ఇతర బీజేపీ అగ్రనేతలను కూడా కలవనున్నారు. 

ఏపీలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా చేయి కలిపేలా చేయడమే చంద్రబాబు పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అమిత్ షాను ఒకసారి కలిశారు. ఇవాళ్టి సమావేశంతో ఏపీలో పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. నడ్డాను కలిసిన అనంతరం పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

కాగా, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ రాత్రికి ఢిల్లీ వెళతారని... చంద్రబాబు, పవన్ కలిసి అమిత్ షాతో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ, పవన్ ఢిల్లీ పర్యటనపై జనసేన పార్టీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.

Chandrababu
Amit Shah
Pawan Kalyan
New Delhi
TDP
Janasena
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News