Lal Salam: రేపు ఓటీటీ సెంటర్ కి వచ్చేస్తున్న రజనీ 'లాల్ సలామ్'

Lal Salaam Movie Update

  • ఫిబ్రవరి 9న విడుదలైన 'లాల్ సలామ్'
  • రజనీ కూతురు డైరెక్షన్ లో వచ్చిన మూవీ 
  • థియేటర్స్ వైపు నుంచి ఎదురైన నిరాశ
  • రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్


రజనీకాంత్ కీలకమైన పాత్రగా, ఆయన కూతురు ఐశ్వర్య రూపొందించిన 'లాల్ సలామ్' .. ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైకా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, ప్రధానమైన పాత్రలను విష్ణు విశాల్ - విక్రాంత్ పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

అలాంటి ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను రేపటి నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. క్రికెట్ నేపథ్యం .. స్నేహానికి సంబంధించిన ఎమోషన్స్ .. గ్రామీణ నేపథ్యం ..  మాఫియా టచ్ ..  ఇలా అనేక వైపుల నుంచి ఈ కథ నడుస్తుంది.     

'జైలర్' తరువాత రజనీ నుంచి వచ్చిన సినిమా కావడంతో, ఈ సినిమా కూడా వసూళ్ల జోరు చూపించవచ్చని చాలామంది భావించారు. అయితే ఈ సినిమాలో కథానాయకుడు రజనీ కాదనేసరికి ఆడియన్స్ ఆలోచనలో పడ్డారు. కథానాయకులు అని చెప్పినవారు ఇక్కడ పెద్దగా తెలియదు. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించకపోవడంలో ఈ కారణం ప్రధానమైనదిగా నిలిచింది.

  • Loading...

More Telugu News