Vishwaksen: నా సినిమా ఫంక్షన్ కి ఆ హీరో అందుకే రాలేదు: విష్వక్సేన్

Vishwaksen Interview

  • దూకుడు అవసరమేనన్న విష్వక్ 
  • కొంతమంది అవమానించారని వ్యాఖ్య 
  • అందుకే మెగాఫోన్ పట్టానని వెల్లడి
  • పెద్ద హీరోలు ఎంకరేజ్ చేశారని వివరణ   


విష్వక్సేన్ కథానాయకుడిగా 'గామి' సినిమా రూపొందింది. ఈ సినిమాతో దర్శకుడిగా విద్యాధర్ పరిచయమవుతున్నాడు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విష్వక్ బిజీగా ఉన్నాడు. తాజాగా 'ఐ డ్రీమ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్వక్ మాట్లాడుతూ, తన కెరియర్ విషయాలను పంచుకున్నాడు. 

" నేను హీరో కావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న సమయంలో, కొంతమంది నన్ను అవమానించారు. దాంతో నా సినిమాకి నేనే దర్శకుడిగా మారవలసి వచ్చింది. నా సినిమాకి నేనే నిర్మాతగానూ వ్యవహరించవలసి వచ్చింది. దూకుడుగా ఉండటం నా స్వభావం ... అది కొన్నిసార్లు అవసరం కూడా. లేదంటే వీడికి తుడుచుకుపోవడం అలవాటేనని అవతలవాళ్లు అనుకుంటారు .. మనకి కూడా తుడుచుకుపోవడం అలవాటైపోతుంది" అని అన్నాడు. 

" ఒకసారి నా సినిమా ఫంక్షన్ కి ఒక హీరోను పిలిచాను. ' ఇది ఫ్యామిలీ సినిమా కాదు .. పైగా బూతులు ఉన్నాయి .. నేను రావడం కరెక్టు కాదనుకుంటా' అని ఆ హీరో రాలేదు. దాంతో నేను వెంకటేశ్ గారిని కలిశాను . నేను ఉదయం ఆయనను కలిశాను .. సాయంత్రం ఆయన ఫంక్షన్ కి వచ్చేశారు. ఆ తరువాత బాలకృష్ణ .. ఎన్టీఆర్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు" అని చెప్పాడు. 

Vishwaksen
Actor
Gaami Movie
  • Loading...

More Telugu News