Jayalalitha: నా జీవితంలో దురదృష్టం పాళ్లు ఎక్కువ: జయలలిత

Jayalalitha Interview

  • గ్లామర్ తో మెప్పించిన జయలలిత 
  • హీరోయిన్ గా ఛాన్స్ రాలేదని వెల్లడి
  • చాలా అవకాశాలు చేజారిపోయాయని వివరణ   
  • ఫ్యామిలీ కోసం చేయక తప్పలేదని వ్యాఖ్య


జయలలిత.. శృంగారనాయికగా అలరించిన సినిమాలు ఎక్కువ. ఒకానొక దశలో ఆమెలేని సినిమా ఉండేది కాదు. అంత బిజీగా ఆమె కెరియర్ కొనసాగింది. అలాంటి జయలలిత, ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నా లైఫ్ లో అదృష్టం పాళ్లు ఎక్కువనా? దురదృష్టం పాళ్లు ఎక్కువనా? అంటే, దురదృష్టం పాళ్లే ఎక్కువని చెప్పాలి" అన్నారు. 

"అప్పట్లో ఎక్కడికి వెళ్లినా 'మీరు హీరోయిన్ కంటెంట్ మేడమ్' అనేవారు. కానీ ఎవరూ కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక చాలా పాత్రలు చేతివరకూ వచ్చి జారిపోయాయి. అయినా దిగాలు పడిపోకుండా నా వరకూ వచ్చిన పాత్రలను చేస్తూ వెళ్లాను. నాతో వ్యాంప్ రోల్స్ చేయించారుగానీ, నిజానికి నాకు వ్యాంప్ ఎక్స్ ప్రెషన్ పలకదు" అన్నారు. 

" నేను క్లాసికల్ డాన్సర్ ని .. అందువలన ఎల్. విజయలక్ష్మి మాదిరిగా ఆ తరహా పాత్రలు వస్తాయేమోనని చూశాను .. కానీ రాలేదు. నన్ను చూసినవారు కూడా .. "ఇంతందంగా ఉన్నారు .. మిమ్మల్ని వ్యాంప్ పాత్రలకి ఎలా అడుగుతున్నారు .." అని అంటారు. కానీ ఏం చేస్తాం .. ఫ్యామిలీని పోషించడం కోసం అలాంటి పాత్రలు చేయలేక తప్పలేదు" అని చెప్పారు. 

Jayalalitha
Actress
Tolluwood
  • Loading...

More Telugu News