Chintapalli Ramarao: పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిన టాలీవుడ్ నిర్మాత

Tollywood producer Chintapalli Ramarao joins BJP
  • కాషాయదళంలో చేరిన 'గుర్తుందా శీతాకాలం' ఫేమ్ చింతపల్లి రామారావు
  • బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన పురందేశ్వరి
  • మోదీ విధానాలు నచ్చి పార్టీలో చేరానన్న చింతపల్లి రామారావు 
'గుర్తుందా శీతాకాలం' ఫేమ్ టాలీవుడ్ నిర్మాత చింతపల్లి రామారావు నేడు బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో చింతపల్లి రామారావు బీజేపీలో చేరారు. రామారావుకు కాషాయ కండువా కప్పిన పురందేశ్వరి పార్టీలోకి స్వాగతం పలికారు. వ్యాపారవేత్త అయిన రామారావు వేదాక్షర మూవీస్ బ్యానర్ ను స్థాపించి సినీరంగంలోకి ప్రవేశించారు. 

ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విధానాలు నచ్చాయని, అభివృద్ధి, సంక్షేమం సమంగా పరుగులెత్తిస్తూ దేశాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషి ఆకట్టుకుందుని, అందుకే బీజేపీలో చేరుతున్నానని చింతపల్లి రామారావు వెల్లడించారు. 

ఇక, సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యాసంస్థల అధినేత అశోక్ రాజు, కె.సుధీర్ అనే ఓ సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత తదితరులు కూడా నేడు పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు.
Chintapalli Ramarao
BJP
Daggubati Purandeswari
Andhra Pradesh

More Telugu News