Revanth Reddy: ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన... వీడ్కోలు పలుకుతూ 11 విజ్ఞప్తులతో లేఖ ఇచ్చిన రేవంత్ రెడ్డి

PM Narendra Modi telangana tour completed
  • నిన్న, నేడు తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • రెండు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, సభలు
  • బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన మోదీ
  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి 11 విజ్ఞప్తులు
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్, సంగారెడ్డి బీజేపీ విజయ సంకల్ప సభలలో పాల్గొన్నారు. నిన్న ఉదయం తెలంగాణలో పర్యటన అనంతరం మధ్యాహ్నం తమిళనాడు సభలో పాల్గొన్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకున్న ప్రధాని... రాజ్ భవన్‌లో బస చేశారు.

ఉదయం తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పటేల్‌గూడ సభ అనంతరం హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు బయలుదేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో ఇంకా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

ప్రధానికి రేవంత్ రెడ్డి 11 విజ్ఞప్తులు

వీడ్కోలు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి 11 విజ్ఞప్తులు చేశారు. కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం, హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక మద్దతు, ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర సహకారం, ఇంటింటికీ నల్లా, ఐపీఎస్ క్యాడర్ పెంపు, హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-నాగపూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, భారత్ మాలలో తెలంగాణకు ప్రాధాన్యత, తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ తదితర అంశాల్లో సహకారం కోరుతూ విజ్ఞాపన లేఖను అందించారు.
Revanth Reddy
Congress
Narendra Modi
BJP
Telangana

More Telugu News