Ch Malla Reddy: ప్రభుత్వం కక్ష సాధింపు చర్య... కావాలనే నన్ను టార్గెట్ చేశారు: మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy accuses government for road removal

  • అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపణ
  • హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేసినట్లు వెల్లడి
  • 2,500 గజాల రోడ్డు స్థలానికి గాను ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చినట్లు వెల్లడి

ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని అన్నారు. 

హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని తాను అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేశానన్నారు. 2,500 గజాల రోడ్డు స్థలానికి గాను ప్రత్యామ్నాయంగా తన స్థలాన్ని నాడు మున్సిపాలిటీకి ఇచ్చానని మల్లారెడ్డి తెలిపారు. కాలేజీ రోడ్డు తొలగించడంతో 25 వేలమంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Ch Malla Reddy
Telangana
Congress
collage
  • Loading...

More Telugu News