Irland: ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 4వ వేగవంతమైన జట్టుగా అవతరణ

Ireland registered first victory In  Test cricket and becoming the 4th fastest team in the 147 year history of cricket

  • ఆఫ్ఘనిస్థాన్‌పై గెలుపుతో టెస్ట్ ఫార్మాట్‌లో మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసిన ఐర్లాండ్
  • 7 మ్యాచ్‌ల్లోనే తొలి టెస్ట్ విజయం అందుకున్న క్రికెట్ పసికూన
  • తొలి గెలుపును వేగంగా అందుకున్న జట్టుగా అవతరించిన ఐర్లాండ్
  • 25 మ్యాచ్‌లు ఆడి తొలి టెస్ట్ విజయాన్ని అందుకున్న భారత్

క్రికెట్ పసికూన ఐర్లాండ్ చారిత్రాత్మకమైన గెలుపుని సాధించింది. టెస్ట్ ఫార్మాట్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. ఏడు ఓటములకు ముగింపు పలికి తన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను గెలుచుకుంది. మూడో రోజు గెలుపునకు అవసరమైన 111 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఐర్లాండ్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్ ఆండీ బల్బిర్నీ 58 పరుగులతో కడదాక క్రీజులో ఉండడంతో విజయం సాధించింది. దీంతో వరుసగా 7 ఓటముల తర్వాత ఐర్లాండ్ తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది. ఒక దశలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆందోళన కనిపించింది. కానీ కెప్టెన్ బల్బిర్నీ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుని గెలిపించాడు.

2018లో పాకిస్థాన్‌‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఐర్లాండ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. మొత్తానికి 7 ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. దీంతో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని అందుకున్న నాలుగవ వేగవంతమైన జట్టుగా ఐర్లాండ్ నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులో విజయం అందుకుంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు రెండు మ్యాచ్‌లు, ఇక వెస్టిండీస్ ఆరు మ్యాచ్‌లకు తొలి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఐర్లాండ్ ఎనిమిదవ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఇక భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందుకోవడానికి ఏకంగా 25 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News