Hyderabad: బెంగళూరులో బాంబు పేలుడు... హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

Hialert in hyderabad after bengaluru bomb blast

  • బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కలకలం
  • అప్రమత్తమైన హైదరాబాద్‌ పోలీసులు
  • కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్న హైదరాబాద్ సీపీ  

కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రసిద్ధ 'రామేశ్వరం కేఫ్‌'లో బాంబు పేలుడు నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని తెలిపారు. బెంగళూరు కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌ వద్ద శుక్రవారం మధ్యాహ్నం పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ధాటికి తొమ్మిది మంది గాయపడ్డారు. గుర్తు తెలియ‌ని వ్యక్తి కేఫ్‌లో ఉంచి వెళ్లిన బ్యాగు కారణంగా పేలుడు సంభవించినట్లు నిర్ధారించారు.

Hyderabad
Bengaluru
Telangana
bomb blast
  • Loading...

More Telugu News