Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు

Explosion at Bengalurus popular Rameshwaram Cafe
  • బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్‌లో పేలుడు
  • ముగ్గురు కేఫ్ సిబ్బంది, ఒక కస్టమర్‌కు గాయాలు
  • నలుగురికీ ప్రాణాపాయం లేదని వెల్లడించిన పోలీసులు
బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది, ఒక కస్టమర్ ఉన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, మధ్యాహ్నం ఒకటింటికి ఓ బ్యాగ్‌లో ఉంచిన వస్తువు పేలిపోయినట్లుగా తెలుస్తోంది. కానీ పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, వారు క్షేమంగా ఉన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

కేఫ్‌లో పేలుడు విషయం తెలియగానే వైట్‌ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోపక్క, ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఫోరెన్సిక్ అధికారులు కేఫ్ వద్దకు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ జాయింట్ కేఫ్‌లలో రామేశ్వరం కేఫ్ ఒకటి.
Bengaluru
blast
cafe

More Telugu News