Inter Exams: ఏపీలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
- మార్చి 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
- మార్చి 2 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు
- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
ఏపీలో రేపు (మార్చి 1) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 4,73,058 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయనున్నారు. మార్చి 2 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. 4,88,881 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1,559 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 57 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
సమస్యలపై ఫిర్యాదులకు రెండు కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 08645 277707, 1800 425 1531 నెంబర్లకు కాల్ చేసి, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.