Medaram Jatara: మేడారం హుండీ లెక్కింపు... తొలిరోజు ఆదాయం రూ.3.15 కోట్లు

first day count rs 3 crores in Medaram Hundi
  • 518 హుండీలకు గాను తొలి రోజు 134 హుండీల లెక్కింపు పూర్తి
  • దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న లెక్కింపు
  • ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయనున్న అధికారులు
మేడారం సమ్మక్క సారలమ్మ వార్ల హుండీ ఆదాయం తొలిరోజు రూ.3.15 కోట్లుగా ఉంది. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు గురువారం నాడు ప్రారంభమైంది. మొత్తం 518 హుండీలను లెక్కించనున్నారు. ఇందులో భాగంగా నేడు మొదటి రోజు 134 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేస్తారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కిస్తున్నారు. లెక్కింపు కోసం సీసీ కెమెరాలతో పాటు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
Medaram Jatara
sammakka sarakka
Telangana
TTD

More Telugu News