Sreemukhi: నాకు వయసు పెరుగుతోంది: శ్రీముఖి

My age is increasing says Sreemukhi

  • తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి
  • పెళ్లికి సంబంధించి తల్లిదండ్రుల ఒత్తిడి లేదని వెల్లడి
  • ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకునే స్వేచ్ఛను ఇచ్చారన్న శ్రీముఖి

బుల్లి తెర స్టార్ యాంకర్ శ్రీముఖి... సినిమాల్లో సైతం ప్రేక్షకులను అలరిస్తోంది. చలాకీతనం, వాక్చాతుర్యంతో పాటు తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం శ్రీముఖి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫొటో షూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టిన శ్రీముఖి ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో తనకు ఓ లవర్ ఉండేవాడని, బ్రేకప్ అయిందని ఆమె ఓ షోలో చెప్పింది. 

బుల్లితెర భామలు, సినిమా హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. కానీ, శ్రీముఖి మాత్రం తన పెళ్లి గురించి అసలు మాట్లాడటమే లేదు. తాజాగా పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వాలంటూ శ్రీముఖిని ఓ రిపోర్టర్ అడగ్గా... ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

తన వయసు పెరుగుతోందని... దానికి తగ్గట్టుగానే పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయని శ్రీముఖి తెలిపింది. పెళ్లికి సంబంధించి ఇంట్లో కూడా ఒత్తిడి ఉందని అంటున్నారని.. కానీ అలాంటిదేమీ లేదని చెప్పింది. నీ రంగంలో నీవు సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నావు, అలాగే ముందుకు వెళ్లు, నీకు చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకో అని తన తల్లిదండ్రులు స్వేచ్ఛను ఇచ్చారని తెలిపింది.

More Telugu News