Pothina Mahesh: వైసీపీకి 40 సీట్లకు మించి రావనే ప్రశాంత్ కిశోర్ నివేదిక జగన్ కు అందింది: జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్

Jagan received Prashant Kishor

  • ఎన్నికల్లో బటన్ నొక్కడం, జగన్ ను ఇంటికి పంపడం ఖాయమన్న మహేశ్
  • టీడీపీ, జనసేన కూటమికి 150 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా
  • వపన్ పై విష ప్రచారం చేస్తే జెండా కర్ర తిరగేసి కొడతామని హెచ్చరిక

వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ గెలుపు ఖాయమని... నిన్న జరిగిన సభతో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ అన్నారు. నిన్నటి టీడీపీ, జనసేన సభకు హాజరైన జనసందోహాన్ని చూసి వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ సర్వేలో కూడా వైసీపీకి 40 సీట్లకు మించి రావనే నివేదిక జగన్ కు అందిందని తెలిపారు. ఎన్నికల్లో బటన్ నొక్కడం, జగన్ ను ఇంటికి పంపడం ఖాయమని చెప్పారు. టీడీపీ, జనసేన కూటమి 150 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

పవన్ కల్యాణ్ పై పదేపదే విష ప్రచారం చేస్తే... జెండా కర్ర తిరగేసి కొడతామని పోతిన మహేశ్ హెచ్చరించారు. జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ తట్టాబుట్టా సర్దుకుని ప్యాకప్ అయిపోతుందని చెప్పారు. జగన్ ఇచ్చిన పథకాల వల్ల ఒక్క పేదవాడైనా ధనికుడు అయ్యాడా? అని హెచ్చరించారు. ఈ విషయంపై సజ్జల కానీ, ఇతర మంత్రులు కానీ ఈ సవాల్ ని స్వీకరించి చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. జగన్ నేతృత్వంలో రద్దు చేసిన వంద పథకాలను తాను చెపుతానని, కాదని మీరు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

Pothina Mahesh
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP
Prashant Kishor
  • Loading...

More Telugu News