Nagababu: ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు

Iam taking back my words says Nagababu
  • 5.3 అడుగుల ఎత్తున్న వారికి ఆర్మీ, పోలీస్ పాత్రలు సెట్ కావన్న నాగబాబు
  • ఒక హీరో గురించి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం
  • ఆ మాటలు యాదృచ్ఛికంగా వచ్చినవేనని వివరణ
ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ కు పోలీస్, ఆర్మీ పాత్రలు సరిగ్గా సరిపోతాయని... 5.3 అడుగుల ఎత్తున్న వ్యక్తికి ఆ పాత్రలు సరిపోవని ఆయన అన్నారు. ఒక హీరోని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

ఈ నేపథ్యంలో నాగబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... పోలీస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది... 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడానని చెప్పారు. ఆ మాటలను తాను వెనక్కి తీసుకుంటున్నానని... ఎవరైనా ఆ మాటలకు నొచ్చుకునుంటే... అయాం వెరీ సారీ అని అన్నారు. ఆ మాటలు యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ, కావాలని అన్న మాటలు కాదని చెప్పారు. అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
Nagababu
Tollywood

More Telugu News