YSRCP: తనపేరు వేయలేదని.. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వైసీపీ సర్పంచి

YSRCP sarpanch Prakasam District

  • ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఘటన
  • అభివృద్ధి పనుల శిలాఫలకాలపై లేని సర్పంచి పేరు
  • తనను గౌరవించలేదని సర్పంచి ఆగ్రహం

అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వైసీపీ సర్పంచ్ ధ్వంసం చేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో జరిగింది. మండలంలో ఉన్న చట్లమిట్ల, రేగునుమానుపల్లి గ్రామాల సచివాలయం, ఆర్బీకేలను రేగునుమానుపల్లిలో నిర్మించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై రేగునుమానుపల్లి సర్పంచి పాలగిరి వెంకట రామాంజనేయరెడ్డి పేరును వేయలేదు. 

దీనిపై రామాంజనేయరెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైసీపీలో ఉన్న ఓ వర్గం నాయకులకు అధికారులు తలొగ్గి తన పేరును రాయలేదని మండిపడ్డారు. నాయకులు, అధికారుల పేర్లను రాసి... సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న తన పేరును రాయలేదని విమర్శించారు. సుత్తితో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తనను గౌరవించకపోవడంతో బాధతో ఈ పని చేశానని చెప్పారు.

  • Loading...

More Telugu News