Kidnap: యువతి కిడ్నాప్‌నకు ఆటో డ్రైవర్ యత్నం.. విశాఖలో కలకలం

Visakha auto driver attempt to kidnap young girl
  • తన ఆటో ఎక్కిన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్
  • భయంతో రన్నింగ్ ఆటో నుంచి కిందికి దూకేసిన యువతి
  • ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్న పోలీసులు
  • పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలింపు
తన ఆటో ఎక్కిన యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాక, ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడో ఆటో డ్రైవర్. దీంతో అప్రమత్తమైన యువతి వేగంగా వెళ్తున్న ఆటో నుంచి కిందికి దూకి తప్పించుకుంది. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. విశాఖపట్టణంలో జరిగిందీ ఘటన.

ఆటో నుంచి కిందికి దూకి తీవ్రంగా గాయపడిన యువతిని చూసిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, బాధితురాలు కిందికి దూకడం, జనం గుమికూడడంతో ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
Kidnap
Auto Driver
Visakhapatnam District
Crime News

More Telugu News