Srisailam: మార్చి 1 నుంచి 11 వరకు శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు

Brahmotsavalu in Srisailam From March 1st to 11th
  • మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు
  • ఆ రోజుల్లో స్పర్శ దర్శనాలు కూడా రద్దు
  • శివస్వాములకు మాత్రం 1 నుంచి 5 వరకు ప్రత్యేక వేళ్లలో స్పర్శ దర్శనం
మహాశివరాత్రి సందర్భంగా  శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అవే రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు వేలాదిగ తరలి వస్తారని, కాబట్టి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

శివస్వాములకు మాత్రం 1వ తేదీ నుంచి 5న సాయంత్రం వరకు నిర్దిష్ట వేళ్లలో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 5న రాత్రి 7.30 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేసినట్టు ఈవో పేర్కొన్నారు.
Srisailam
Brahmotsavalu
Devotees
Mahashivaratri

More Telugu News